సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో గత శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మధ్య గొడవ త్రోపులాట జరిగింది. వివరాలలోకి వెళ్ళితే .. వీరవాసరం గ్రామానికి చెందిన జనసేన పార్టీకి చెందిన బండారు మణికంఠ అనే యువకుడు వైసీపీ నాయకులపై సోషల్‌ మీడియాలో అసభ్య కర పోస్ట్‌ పెట్టడంతో వైసీపీ కార్యకర్తలు వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మణికంఠను పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) జనసేన నేతలతో కల్సి పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని పోలీసులతో మణికంఠ అరెస్టు ఫై వివరణ కోరారు.. విషయం తెలుసుకొన్న వైసిపి కార్యకర్తలు వైసీపీ నేత, రాష్ట్ర బీసీ బోర్డు డైరెక్టర్ కామన నాగేశ్వర రావు ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని చినబాబుని ప్రశ్నించడంతో వాగ్వాదము జరిగింది. వైసిపి నేతలు పోలీస్ స్టేషన్ లో బెటాయింపు కు సిద్ద పడ్డారు. అయితే పోలీసులు వైసిపి ,జనసేన అందరిని బయటకు నెట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తదుపరి పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరిపి చట్ట ప్రకారం వ్యవహరిస్తామని సహకరించాలని ఇరువర్గాలను పంపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *