సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపార్టీ రామాంజనేయులు నేడు, సోమవారం వీరవాసరం మండలంలో పలు ‘కూటమి’ నేతల కుటుంబాలను పరామర్శించారు. అండలూరు గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మరణించిన షేక్ మీరా సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. తదుపరి జగన్నాధాపురం గ్రామంలోని ప్రముఖులు కడలి వాసు, తల్లి కడలి పుష్పవతి మరణించారు ( ఫై ఫొటోలో )వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చింతలకూటి గురువులో కొల్లేపర శ్రీను భార్య శ్రీమతి సునీత అనారోగ్యం కారణం గా ఆపరేషన్ చేయించి కున్నారు వారిని కూడా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పరామర్శించారు
