సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పాలన అందిస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు,మంగళవారం పల్లె పండుగలో భాగంగా వీరవాసరం మండలంలోని పలు గ్రామంలో సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. నవుడురు గ్రామంలో 36 లక్షలతో 3 సీసీ రోడ్లు, కొణితవాడ గ్రామంలో రూ13 లక్షలతో సీసీ రోడ్డు, ఉత్తరపాలెం గ్రామంలో రూ 10 లక్షలతో సీసీ రోడ్డు, రాయకుదురు గ్రామంలో రూ 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను సుమారు రూ 69 లక్షలతో రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అన్ని గ్రామాల్లోనూ సిమెంట్ రోడ్లు వేయిస్తున్నామని, కోట్లాది రూపాయలతో గ్రామాలను సుందరీకరణ చేశామని అన్నారు. పల్లెల్లో పండుగ వాతావరణం తెచ్చేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచ్ లు, ఇన్ ఛార్జ్ లు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
