సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఉదయం వీరవాసరంలోని తులసి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వీరవాసరం మండల డ్వాక్రా మహిళల సమావేశంలో పాల్గొన్నారు. సీఎం జగన్ పరిపాలన లో ప్రభుత్వ సంక్షేమ ఫలాలో, పదవులలో పెద్ద వాటా ఇచ్చారని, మహిళాల ఆర్ధిక అభివృద్ధి కి పెద్దపీట వెయ్యడం జరిగిందని .. పేద మహిళలను ఆదుకోవడానికి ప్రస్తుతం వైయస్సార్ ఆసరా పథకంలో మూడో విడత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం కూడా జరిగిందని తెలిపారు. మూడో విడతగా మీ వీరవాసరం మండలానికి 11 కోట్ల 88 లక్షలు రూపాయలు డ్వాక్రా రుణ మాపి చెయ్యడం జరిగిందని జగనన్న ప్రభుత్వానికి మీ సహకారం కీలకం అన్నారు.
