సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని, వంకాయలపాలెం గ్రామానికి చెందిన మర్రివాడ తారక రామారావు (40) విస్సా కోడేరులో రైల్వేగేటు మెన్ గా ఆ ప్రాంతంలో అందరికి సుపరిచితుడు. గత బుధవారం వ్యక్తిగత పనులపై విస్సా కోడేరు నుంచి మోటారు బైక్ ఫై రావులపాలెం వెళుతుండగా, వీరవాసరం సమీపంలోని జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చి న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో బైక్ నుండి పడిపోయిన ఆయనకు తీవ్రగాయాలతో అక్కడికక్క డే రామారావు మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై పి.రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిం చారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
