సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వీరవాసరం వ్యవసాయ పరపతి సొసైటీ సంఘం చైర్మన్ వీరవల్లి శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా బండారు మణికంఠ బ్రహ్మానందం, దూసనపూడి శ్రీనివాస్ లు నేడు, గురువారం (త్రీ సభ్య కమిటి) ప్రమాణ స్వీకారం చేశారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పీఏసిఎస్ లు రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని, గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జనసేన, టిడిపి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మంతెన రామరాజు, మహిళా సాధికారత చైర్మన్ పీతల సుజాత, రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పోరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం మార్కెట్ కమిటీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్, ఎంపిపి, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, గ్రామస్తులు, కూటమి నేతలు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *