సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం జొన్నలపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మెతుకుమెల్లి నాగ వెంకటసతీష్(33) ఇటీవల అదృశ్యమైన నేపథ్యంలో ఆయన మృతదేహం బాడవ సమీపంలో గోదావరిలో లభ్యమైంది. బెంగళూరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సతీష్ వర్క్ ఫ్రం హోంగా స్వంత గ్రామంలో ఇంటివద్ద నుంచి జాబ్ చేసుకొంటున్నారు. సతీష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. గత శనివారం, భీమవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసి వస్తానని వెళ్లిన సతీశ్ అదృశ్యమయ్యారు. అయితే ఆయన మోటారుసైకిల్ చించినాడ బ్రిడ్జిపై ఉందని తెలియడంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోదావరిలో గాలింపు చర్యలతో గత సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
