సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పలు వివాదాలు ఎదురొకొంటున్న భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం ZPTC జనసేన పార్టీనాయకులు గుండా జయప్రకాష్ నాయుడు ను మొన్న మంగళవారం తణుకు పట్టణంలో కోర్ట్ లో పెండింగ్ లో ఉన్న ఒక స్థలం వద్దకు వచ్చి కాపలాదారునిపై దాడి చేసారని ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జనసేన పార్టీ నాయకులు తణుకు సబ్ జైలుకు వచ్చి జయప్రకాష్ ను పరామర్శశించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ.. పోలీసులు అక్రమ కేసు పెట్టారని, వివరాలలోకి వెళ్ళితే .. కోర్టు ఆక్షన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ వద్ద నుండి జయప్రకాష్ కొన్నటువంటి 1.15 సంట్ల స్ధలంలో రెడ్డి &రెడ్డి సంస్థకు చెందిన రౌడీలు కంచె వేస్తుంటే తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి గుండా జయప్రకాశ్ వెళ్ళినప్పుడు.. అధికార పార్టీ మినిష్టర్ , అధికార పార్టీ ఎమ్మెల్యే ల ఒత్తిడికి తలదించిన పోలీస్లు అక్రమంగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వారిని నేరస్థులుగా కేస్ పెట్టి అరెస్ట్ చేసారని ఆరోపించారు,జనసేన పార్టీ తరుపున పూర్తి మద్దతు ఇస్తూ న్యాయ పోరాటం చేస్తామని తెలియచేశారు. భీమవరం కు చెందిన రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి మెంబర్ కనకరాజు సూరి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, జనసేనపార్టీ నాయకులు అడ్వకేట్ అనుకుల రమేష్,నరసాపురం నియోజకవర్గ జనసేన నాయకులు చాగంటి మురళీకృష్ణ,, ఉండి నియోజకవర్గం ఇన్చార్జి జుత్తిగ నాగరాజు,గుండా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
