సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అఖండ బంపర్ హిట్ తరువాత నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’ మైత్రి పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగటానికి సిద్ధమౌతోంది. బాలయ్యకు సినిమా టైటిల్ లో సింహ ఉంటె హిట్ ఖాయం అనే సెంటిమెంట్ కూడా ఉంది. అది రుజువు అయ్యింది కూడా.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌లో జరుగుతోంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ లో భాగంగా .. తాజాగా నేడు, శుక్రవారం ‘జై బాలయ్య’ అనే ఫస్ట్ సింగిల్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఈ సాంగ్‌కి సంబంధించి వివరాలు తెలిపేందుకు విడుదల చేసిన లుక్స్‌లో బాలయ్య అందంగా రాయల్‌గా కనిపించి.. పాటపై, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాడు. అయితే గతంలో వచ్చిన ‘వసేయ్ రాములమ్మ”టైటిల్ సాంగ్ తరహా ట్యూన్ లో పాట ఉండటం గమనించవచ్చు.. ‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరునిన్ను తలుచుకున్నవారు.. లేచి నుంచొని మొక్కుతారుఅచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా..అల నాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా..మా తెల్లవారే పొద్దు నువ్వయ్యా.. అంటూ ఎస్. థమన్ సంగీతంతో సాగిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి పాటతో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *