సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి.ఎన్.ఆర్. వాకర్స్ అసోసియేషన్ వారిచే వాకర్స్ మిత్రులకు నేడు, శుక్రవారం ఉదయం తైవాన్ జామ, వాటర్ ఆపిల్ మరియు నిమ్మ సుమారు 250 మొక్కలు డి.ఎన్.ఆర్. కళాశాల అసిస్టెంట్ సెక్రటరి ఆర్.రామకృష్ణంరాజు మరియు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.పల్లారావు చే పంపిణీ చేయడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షితః చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని దానిలో భాగంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సెక్రటరి పి.సీతారామరాజు, ఎన్.మహేష్ కుమార్, జి.అజయ్ కుమార్, ప్రొ.పి.సుబ్బారావు, వి.నాగమోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
