సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వృక్షో రక్షతి రక్షిత: వృక్షాలను రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి. చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత సమాజంలో మనందరిపై ఉందని డి.యన్.ఆర్. కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ కొత్తపల్లి శివరామరాజు అన్నారు. అడవులను విచక్షణారహితంగా నరకడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అనేక అనర్ధాలకు దారితీయునని, వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యాల పాలు అవుతున్నారని డి.యన్.ఆర్. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కటికల పల్లారావు అన్నారు. డి.యన్.ఆర్. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు, మంగళవారం ఉదయం, తైవాన్ జామ మొక్కలను వాకర్స్ అందరికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి యన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు, జాలీవాకర్ అప్పలరాజు, భీమాల శ్రీరామమూర్తి, భట్టిప్రోలు శ్రీనివాసరావు, రామకృష్ణరాజు, సాయిజీ రావు, బాబ్జి, మృత్యుంజయుడు, మావుళ్ళు, శ్రీనివాస్ మరియు మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
