సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 27వ వార్డు రెస్ట్ హౌస్ రోడ్డులో నేడు, గురువారం ఉదయం, స్వర్గీయ పిళ్లా ఎలిజబెత్ నవమణి రాజు 32వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పిళ్లా విక్టర్ దేవరాజ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు చేతుల మిడుఁగా 80 మంది వృద్దులకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. గత 32 ఏళ్లుగా విక్టర్ దేవరాజ్ వారి తల్లి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విశేషమని, ఇటువంటి సేవ కార్యక్రమాలు సమాజానికే ఆదర్శమని అన్నారు. గతించిన వారి పేరుమీద ఇలాపేదలకు దానాలు చేస్తే వారి కుటుంబానికి దేవుని అనుగ్రహం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏం శ్యామల, ఎఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు విజ్జురోతి రాఘవులు, మైలబత్తుల ఐజాక్ బాబు, మల్లువలస రాము, లంకీ శ్రీను, ముచ్చకర్ల శివ, అల్లు శ్రీనివాస్, జోషి బాయ్, విలియం కేర్ తదితరులు పాల్గొన్నారు.
