సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ( హిట్ సిరీస్ పేమ్ .. ) దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా 75వ సినిమాగా ‘సైంధవ్’ అని మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ఈ మూవీ పలు భాషల్లో విడుదల కానుండటంతో కీలక పాత్రల కోసం ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా నటీనటులను తీసుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు కాగా, మేకర్స్ కీలక పాత్రను తమిళ హీరో ఆర్య తో చేయిస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్త షికారు చేస్తుంది.గతంలో వరుడు తెలుగు సినిమా లో అల్లు అర్జున్ కు ప్రతినాయకుడిగా ఆర్య నటించారు. వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యంత రెమ్యూనేషన్ 17 కోట్లు తీసుకొన్నట్లు ప్రచారం జరుగుతింది. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మితమవుతుంది. ‘కెజియఫ్’ ఫేమ్ శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *