సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సంక్రాంతి కి ‘సైంధవ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకిమామ నిరాశపరిచాడు. అయితే తదుపరి చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడి తో కమిట్ అయ్యాడు. అయితే ఇందులో ఇంకొక హీరోగా వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమా మాత్రం ‘ఎఫ్ 2′ ఎఫ్ 3 సినిమాల కి సీక్వెల్ మాత్రం కాదంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు వెంకటేష్, వరుణ్ తేజ్ ఇదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ అనే సినిమాలో నటించారు అది చాలా పెద్ద హిట్ అయిన విషయం కూడా తెలిసిందే. ఆ తరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ కూడా హిట్ అయ్యింది, మరోసారి ఎఫ్ 4గా నవ్వులు పూయించడానికి వస్తున్నారు కానీ గత 2 చిత్రాలకు ఇది పూర్తిగా దానికి భిన్నమైన కథ అని తెలిసింది. అందుకే ఆ సినిమాకి ఇది సీక్వెల్ కాదు అని అంటున్నారు. వెంకటేష్ కు మరోసారి అనిల్ రావిపూడి ఇప్పటికే షూటింగ్ కు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న ఈ సినిమా వచ్చే దసరా కు కానీ సంక్రాంతి బరిలో దింపే యోచనలో దిల్ రాజు ఉన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో ని పరిచయం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *