సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా లో జరుగుతున్న తెలుగువారి ‘ తానా’ సభలలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేష్ మరియు మాస్ అఫ్ గాడ్ బాలకృష్ణ తానా వేదికగా త్వరలో తాము మల్టీస్టార్ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. వెంకటేష్ మాట్లాడుతూ.. తాను వరుసగా 4 సినిమాలు చేస్తున్నట్లు .. అందులో బాలయ్య తో తాను నటించే మల్టీ స్టార్ సినిమా ఫైనల్ అయ్యిందని త్వరలో ప్రారంభం అవుతుందని తాను కూడా ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఉన్నానని అభిమానుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తో కలసి ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న వెంకీ మామ సినిమా వచ్చే సంక్రాంతికి సిద్ధం అవుతుంది. ఒకనాటి సూపర్ స్టార్ కృష్ణ తరువాత ఎక్కువ మంది హీరోల తో మల్టి స్టార్ సినిమాలు చేసిన ఘటన ఇప్పుడు వెంకీ మామకే చెందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *