సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వివాదలకు దూరంగా ఉండే సీనియర్ హీరో వేంకటేష్ ఫై తాజగా నేడు, సోమవారం కేసు నమోదు అయ్యింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, అన్నయ్య సురేష్ బాబు , హీరో రానా, అభిరామ్లపై IPC 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు నేడు, సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నం ద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 20కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చి వేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.
