సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘గుంటూరు కారం’ తర్వాత భీమవరం బ్రాండ్ త్రివిక్రమ్ తదుపరి రెండు ప్రాజెక్టులు అధికారికంగా ఖరారయ్యాయి. అందులో ఒకటి ముందుగా విక్టరీ వెంకటేష్ తో, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నారు. అయితే తాజాగా వెంకీ- త్రివిక్రమ్ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాకు ‘వెంకట రమణ’ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీనికి “కేర్ ఆఫ్ ఆనంద నిలయం” అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టారని అంటున్నారు. త్రివిక్రమ్ – వెంకీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఉండబోతుందని తెలుస్తోంది. వెంకటేష్ 77వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా త్రివిక్రమ్- వెంకీ కాంబోలో రాబోతున్న మొదటి సినిమా ఇది. గతంలో త్రివిక్రమ్ వెంకటేష్ నటించిన “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” వాసు సినిమాలకు రచయితగా పనిచేశారు. ఇప్పుడు మొదటిసారి వెంకటేష్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్ర షూటింగ్ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ జులైలో 20 రోజుల షూటింగ్లో పాల్గొంటున్నారు.
