సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుసగా 9 విజయాల నేపథ్యంలో అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. సంక్రాంతి సినిమాల మొనగాడుగా భారీ విజయాలు నమోదు చేసాడు. తాజా సమాచారం ప్రకారం ఆయన తనకు బాగా కలసివచ్చిన విక్టరీ స్టార్ వెంకటేష్‌తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ శివ శంకర వర ప్రసాద్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ భారీ విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ‘లక్కీ’ కాంబినేషన్‌లో వచ్చే సంక్రాంతి కి సినిమా సిద్ధం చెయ్యనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో పుష్ప లో షెకాయత్ గా రచ్చ రచ్చ చేసిన ఫాజిక్ పజిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా వెంకటేష్ సరసన పూజా హెగ్డే తో పాటు మరో క్రేజీ హీరోయిన్ నటించే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్ల్లాప్ సినిమాలో నటిస్తున్నపూజ దిశను వెంకీ అనిల్ ఎలా మారుస్తారో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *