సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డైరెక్ట్ అచ్చ తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాము తో ఫ్యామిలీ హీరోగా మాస్ హీరోలకు కూడా సాధ్యం కానీ 300 కోట్ల పైగా కలెక్షన్ తో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) తెలుగునాట అగ్రస్థానం లో నిలచిన విషయం అందరికి తెలిసిందే. ఇటీవల చిరంజీవి తో శివ శంకర వర ప్రసాద్ సినిమాలో 30నిమిషాల తన అతిధి పాత్ర షూటింగ్ పూర్తీ కావడంతో.. మరి కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. భీమవరం మేడ్ ఇన్.. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకుడిగా హారిక అండ్ హాసిని పతాకంపై నిర్మిస్తున్నారు. (గతంలో ఇదే సంస్థకు చెందిన సిస్టర్ కన్సర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్ లో వెంకటేశ్ ‘బాబు బంగారం’ హిట్ మూవీలో నటించారు. దానికి మారుతీ దర్శకత్వం వహించారు.) తాజాగా వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ నిరవధిక షూటింగ్ ను నేడు, బుధవారం డిసెంబర్ 10న గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలు పెట్టారు. దీనికి‘ఆదర్శ కుటుంబం’ అనే పేరు ట్యాగ్ లైన్ గా ‘హౌస్ నెం. 47, ఎ.కె. 47‘ అని పెట్టారు. ఈ ట్యాగ్ లైన్ సినిమాలో ‘మల్లీశ్వరి’ తరహాలో యాక్షన్ పార్ట్ కూ ప్రాధాన్యం ఉందని అర్థమౌతోంది. ఇందులో కెజిఎఫ్, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్? కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇవాళే వెంకటేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నూ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని శరవేగంగా షూటింగ్ పూర్తీ చేసి వచ్చే 2026 సమ్మర్ కు రిలీజ్ చేయబోతున్నారు.
