సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ప్రొడక్షన్ నెం. 58 చిత్రం గ్రాండ్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు సూపర్ హిట్స్- F2, F3 తర్వాత వారు వచ్చే సంక్రాంతి కి మరో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి మరోసారి చేతులు కలిపారు. అయితే ఇది ఎఫ్ 4 సిరీస్ మాత్రం కాదు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం నేడు బుధవారం హైదరాబాద్‌లో అత్యంత గ్రాండ్‌గా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలనంతరం ముహూర్తం షాట్‌కు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేయగా, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేయగా.. లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సినిమా కధ విషయానికి వస్తే.. హీరో, అతని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్స్‌లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే సుందరకాండ సినిమా తరహా ఎక్స్‌ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీ, దిల్ రాజు కాంబినేషన్ సీతమ్మ వాకిట్లో, ఏఫ్ 2, ఎఫ్ 3, ఓరి దేవుడా వరకు అన్ని హిట్ సినిమాలే వచ్చాయి మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *