సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో ప్యామిలీ అండ్ లవర్ బాయ్, మాస్ హీరోగా విక్టరీ వెంకటేష్ 90 శాతం పైగా విజయాలు సాధించిన ఏకైక సినీ అగ్ర హీరో, బ్రహ్మ పుత్రుడు, చంటి, బొబ్బిలిరాజా, హిందీలో 12 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ ఆడిన అన్నారి అగ్ర రాజా,ప్రేమించుకొందాం. రా కలిసుందాం రా. తులసి, జయం మనదేరా, సీతమ్మ వాకిట్లో.. F3 వంటి ఇండస్ట్రీ లో అల్ టైం రికార్డ్స్ సృష్టించిన బంపర్ హిట్స్ ఎన్నో.. విక్టరీ వెంకీ సొంతం.. అనిల్ రావిపూడి తో వెంకీ మామ కాంబినేషన్ అంటే ఇక చెప్పేది ఏమి ఉంది. గతంలో ఇక ఎఫ్ 2 తో 140 కోట్లు , ఎఫ్ 3తో 110 కోట్లు కొల్ల కొట్టిన వెంకీ మామ..ఇక ఈ సంక్రాంతికి వస్తున్నాంతో కేవలం తెలుగు వర్షన్ తో 7 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు అవలీలగా కొల్లగొట్టి సరికొత్త రికార్డు సాధించారు..ఆయన సమకాలీకులయిన సీనియర్ అగ్ర హీరోలు ఎవరికీ కూడా ఈ రికార్డు లేదు. కేవలం 72 రోజులలో తీసిన ఈ సినిమాతో భారీ టికెట్స్ ధరలతో బెనిఫిట్ షోలు లేకుండా యువహీరోలు కు సైతం సవాల్ విసిరేలా వెంకీ మామ ఎంత బలమైన NO. 1 హిట్ కొట్టాడో అర్దమైయింది. ఈ సినిమా ఈ సినిమా తెలుగునాట, అమెరికాలో కలెక్షన్ ఊచకోత చూస్తుంటే.. దూకుడు చూస్తుంటే 300 కోట్లు కూడా సాధ్యమే అనిపిస్తుంది. ఇక భీమవరంలో నిన్నటికి 8 రోజులలో 1కోటి 23 లక్షలు కలెక్షన్ సాధించి గత తన రికార్డు F2 సినిమాకు ఇక భీమవరం పట్టణంలో టోటల్ రన్ లో వచ్చిన సుమారు 1 కోటి 40 లక్షల కలెక్షన్ ను కేవలం 10 రోజులలోనే అధిగమిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 6 కోట్లు కలెక్షన్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అనిల్ రావిపూడి బ్రాండ్, వెంకటేష్ ఇమేజ్ కలిసి సంక్రాంతికి వస్తున్నాంను హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *