సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీనియర్ అగ్ర హీరోల చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన వెంకీ మామ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మారథం పడుతున్నారు. గత 12 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.250కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 12 రోజులకు భీమవరంలో సుమారు 1 కోటి 40 లక్షల గ్రాస్ కలెక్షన్ తో గత 2019లో F 2 50 డేస్ కి ఫుల్ రన్ లో వచ్చిన కలెక్షన్ అధిగమించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా లో వెంకీ కొడుకుగా నవ్వులు పూయించిన భీమవరం చిన్నోడు ‘రేవంత్’ పేరు తెలుగునాట మారుమ్రోగుతుంది. ఈ నేపథ్యంలో వెంకీ మామ తో సహా చిత్ర యూనిట్ రేపు ఆదివారం భీమవరంలో సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బ్లాక్ బాస్టర్ సంబరాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.
