సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: విక్టరీ ని తన ఇంటిపేరుగా మార్చుకొని వయస్సు 60 ఫై బడుతున్న యువహీరోలతో పోటీ పడుతూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందించే ఏకైక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ పుట్టిన రోజు నేడు ( డిసెంబరు 13) ఈ సందర్బంగా ఆయనకు సోషల్‌ మీడియాలో అటు ఫ్యాన్స్‌, ఇటు టాలీవుడ్‌ పెద్దలు వెంకీని అభినందనల్లో ముంచుత్తుతున్నారు. ముఖ్యంగా దగ్గుబాటి వారి మరో వారసుడు టాలీవుడ్‌ భల్లాల దేవ రానా ఒక మోషర్‌ పోస్టర్‌ను ట్విట్‌ర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతోపాటు మెగాస్టార్‌ చిరంజీవి, వరుణ్‌ తేజ్‌ , హీరోయిన్‌ ఖుష్బూ, ఇతర నటీనటులతోపాటు, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, డీఎస్‌పీ, తమన్‌ తదితరులు బర్త్‌డే విషెస​ తెలుపుతూ ట్విట్‌ చేశారు. నులి వెచ్చని నీ స్నేహంతో నాముఖంపై చిరునవ్వును ఉంచుతున్న మిత్రమా..థ్యాంక్స్‌.మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్!! అంటూ చిరు ట్వీట్‌ చేశారు. అలాగే రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్‌లోని వెంకటేష్ ఫస్ట్‌లుక్‌ కూడా సందడి చేస్తోంది. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌లో బాబాయ్‌ అబ్బాయిలు వెంకీ, రానా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారతదేశం గర్వించదగిన అద్భుత నటులలో తెలుగునాట వెంకటేష్ ఒకరు. తన అభిమానుల భవిషత్తు పాడవకూడదని వారిని దూరంగా ఉంచుతాడు.. మాటలు, వేడుకలు తక్కువ ..కానీ, తాను హీరోగా నటించిన సుమారు 90 చిత్రాలలో 90 శాతం విజయాలు ఉన్న ఏకైక ఇండియన్ హీరో కూడా వెంకీ మామ.. మాత్రమే.. తెలుగులోనే కాదు హిందీ లో కూడా అన్నారి సినిమా తో ( తెలుగు లో చంటి) బాలీవుడ్ లో 12 కేంద్రాలలో 175 రోజుల సిల్వర్ జూబ్లీలు కొట్టిన ఏకైక తెలుగు హీరో మన వెంకీ మామ.. మామూలోడు కాదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *