సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ సినిమా ‘కల్కి 2898ఏడి‘ విడుదలయింది. దర్శకుడు. నాగ్ అశ్విన్ . ఈసినిమాలో లెజండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించారు. దీపికా పదుకోన్, దిశా పటాని కూడా వున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతంతో సినిమాని సి అశ్వినిదత్ నిర్మించారు. ఈ సినిమా రెండు పార్టులుగా వస్తోంది, ఇప్పుడు ఈ మొదటి పార్టు కథ విషయానికి వస్తే.. ఈ సినిమా మహాభారత యుద్ధం ముగింపు దశతో ప్రారంభం అవుతుంది. కర్ణుడు ( ప్రభాస్ ) అర్జునిని ( విజయ్ దేవరకొండ ) చేతిలో మరణం, దుర్యోధనుని మరణం తరువాత అతని ప్రాణ స్నేహితుడు అశ్వర్దమా (అమితాబ్ ) పాండవ వంశం నాశనం చెయ్యడం కృష్ణుడు అడ్డుకొన్నపటికి , అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో వున్న శిశువుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, దానితో శ్రీకృష్ణుడు అశ్వద్ధామకి శాపం ఇస్తాడు, పశ్చాత్తాపం పొందిన అశ్వద్ధామకి కలియుగంలో మళ్ళీ కల్కిగా అవతరించబోతున్నాను, ఆ శిశివుని నువ్వే కాపాడాలి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇక కలియుగంలో సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) కాంప్లెక్స్ కి అధిపతి. అతను ఒక ఫెర్టిలిటీ ల్యాబ్ ను నడుపుతూ. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తూ ఉంటాడు. అందరి ఆడవాళ్ళని టెస్టు చేస్తూ ఉంటాడు,అక్కడ ఉన్న సుమతి ( దీపికా పదుకొనె) కోసం భైరవ (ప్రభాస్) కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క యాస్మిన్ బారినుండి సుమతిని కాపాడటానికి అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) బయలుదేరతాడు. శంబాలాలో మరియం (శోభన) ఆమె మనుషులు, సుమతి గర్భంలో పెరుగుతున్న పిల్లవాడు సామాన్యుడు కాదు స్వయానా భగవంతుడు అని అంటారు. ఇలా 3 కాలాలకు 3 రకాల జనరేషన్స్ వాటి మధ్య పాత్రలకు లింక్ చేస్తూ విచిత్ర ఫాంటసీ కధ లో చివరికి ఏమైంది తెలియాలంటే ‘సినిమా థియేటర్స్ లో చూడండి. ఇక 3డి ఎఫెక్ట్ లలో రూపొందిన 3గంటల సినిమా మొదటి గంట కాస్త నెమ్మదిగా ఉన్నపటికీ మిగతా 2 గంటల సినిమా అంచనాలకు మించి ఉంటుంది..అర్జునుడుగా విజయ్ దేవర కొండ 4నిముషాలు ఊపేసాడు.. కర్ణుడి గా ప్రభాస్ సూపర్బ్.. ఇక బైరవ గా కామిడి నుండి యాక్షన్ వరకు అల్ రౌండర్ ప్రతిభ చూపించి అందరిని ద్రిల్ చేసాడు. ఇక అమితాబ్ 80 ఏళ్ళ వయస్సు లో కూడా 8 అడుగుల అశ్వర్దమా గా చెలరేగి నటించాడు… కమల్ హాసన్ పాత్ర నిడివి తక్కువ ఉన్న ప్రభావం ఎక్కువే.. రాంగోపాల్ వర్మ, రాజమౌళి చిన్న పాత్రలలో చమక్కు మన్నారు. 300 రూపాయలకు టికెట్ కొని సినిమా చుసిన ప్రేక్షకుడిని నిజంగా ఒక అద్భుత వింత ప్రపంచంలో విహరింప చేసారు.హాలివుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో తెలుగు వాడి సత్తా చూపించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకు నిజమైన హీరో.. ప్రభాస్ కు బాహుబలి స్థాయిలో వచ్చిన బిగ్ హిట్ సినిమా..’కల్కి’ ఇక ప్రభంజనమే..
