సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం ధరలు ఇటీవల దూసుకొనిపోతూ.. సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అమెరికా అడ్జక్షుడు ట్రంప్ దూకుడు నిర్ణయాలు, బెదిరింపులతో విసిగిన భారత్ తో సహా పలు దేశాలు, పెట్టుబడి దారులు కూడా డాలర్ కు బదులుగా సురక్షిత పెట్టుబడిగా బంగారం కొనుగోలు వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి ఆదివారం ఉదయానికి భారత్ లో (సెప్టెంబర్ 28న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 15, 480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 05, 850కి చేరింది. మన తెలుగు రాష్ట్రాలలలో విజయవాడ, హైదరాబాద్ మార్కెట్ లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 15, 480కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,05,850కి చేరింది. వెండి ధరలు ( silver rate) నిన్నటితో పోల్చుకుంటే కేజీ వెండి ధర రూ. 1,59,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అదే ఢిల్లీలో అయితే వెండి కిలో 1,49,000 కు లభించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *