సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సంక్రాంతి సందడి కి వెంప గ్రామం లో వెంప కాశీ ఆధ్వర్యంలో జరిగే సాంప్రదాయ కార్యక్రమాలు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ తిరునాళ్ల తరహాలో జరిగే సందడి, సాంప్రదాయ కోడిపందాలు తెలుగువారి అందరికి తెలిసిందే.. అక్కడ గత రాత్రి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొని భారీ భోగిమంటలు ను ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామా.. కూడా వచ్చి కొద్దీ సేపు సందడి చేసారు. ఎన్నో ఆహ్లాద కార్యక్రమాలు దూరప్రాంతాల నుండి వచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు , అతిధులు , స్నేహితుల సమక్షంలో. సంక్రాంతి కి ఘన స్వాగతం పలికారు.
