సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: బంగాళాఖాతం లో అల్పపీడనం రేపు మంగళవారానికి వాయుగుండంగా మారె అవకాశం ఉండటం దాని ప్రభావం ఒరిసా తో పాటు కోస్తా తీరప్రాంతం ఫై ఉండటంతో భీమవరం పరిసర డెల్టా ప్రాంతాలలో వరి సాగు చేస్తున్న రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గత 2రోజులుగా అడపదడపా వర్షాలు పడుతున్నాయి. చలి తీవ్రత బాగా పెరిగింది. మరోప్రక్క పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి పంట మాసూళ్లు జరుగుతున్న సమయంలో వాయుగుండం హెచ్చరికలు రైతులను కలవర పెడుతుంది. వచ్చేవి పండుగ రోజులు.. చేతికి వస్తున్నా పంట ..వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడితే ధాన్యం పరిస్థితి ఏమిటనేది? ప్రశ్నర్ధకంగా మారింది. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పూర్తిగా మాసూళ్లు అయినప్పటికీ, భీమవరం, ఉండి నియోజకవర్గాలు ఉన్న డెల్టా ప్రాంతాలలో మాత్రం ఇంకా వేల హెక్టార్ల సార్వా సాగులో పది రోజుల నుంచి ముమ్మరంగా మాసూళ్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో వర్షాలు పడకూడదని రైతులు వెయ్యి దేవుళ్లను మ్రొక్కుతున్నారు.
