సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిరుద్యోగ అభ్య ర్థులకు శుభవార్త! ఆర్ఆర్సీ వెస్టర్న్ రైల్వే లో భారీస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. 24 ఏళ్ళ వయస్సు లోపు ఉండి కేవలం టెన్త్, ఐటీఐ, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యో గాలకు అప్లై చెయ్యవచ్చు.. ఆర్ఆర్సీ వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జబల్పుర్ లోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న 2865అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు . సెప్టెంబర్ 29న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆగస్టు 30వ తేది నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఉద్యో గ ఖాళీల సంఖ్య : 2865 ఉండగా వాటిలో జేబీపీ డివిజన్: 1136 పోస్టులు, బీపీఎల్ డివిజన్: 558 పోస్టులు,కోటా డివిజన్: 865 పోస్టులు సీఆర్డబ్ల్యూ ఎస్ బీపీఎల్ డివిజన్: 136 పోస్టులు,డబ్ల్యూ ఆర్ఎస్ కోటా డివిజన్: 151 పోస్టులు,హెచ్క్యూ /జేబీపీ: 19 పోస్టులు ఉన్నాయి.
