సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ అనవసరపు విషయాలలో తలదూర్చి గొప్పలకు పోయి.. అన్ని రోజులు మనవి కాదన్నా రీతిలో తానే ఒక టార్గెట్ గా మిగిలిపోయిన ప్ర‌ముఖ అస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామి కి తాజగా తెలంగాణ హైకోర్టు లో ఒక పెద్ద ఊరట లభించింది. ఇటీవ‌ల అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జ‌రిగిన త‌ర్వాత‌ వారి జాతకాలను విశ్లేషిస్తూ.. ఈ జంట ఎక్కువ రోజులు క‌లిసి ఉండ‌లేరు, రెండు మూడు సంవ‌త్స‌రాల‌లోనే విడిపోతారు అని.. అది కూడా ఒక అమ్మాయి వల్ల అంటూ ఒక వీడియో విడుదల చేశారు.దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలోతెగ వైర‌ల్ అయి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. చాలామంది వేణుస్వామి ని తిడుతూ పోస్టులు పెట్టారు. . కొంత‌మంది పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్ర‌మంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు రియాక్ట్ అయి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నీరెళ్ల శారదను క‌లిసి వేణు స్వామిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. దీనితో విచారణకు హాజరు కావాలని వేణు స్వామిని ఆమె ఆదేశించారు. ఈ ఆదేశాలను వేణు స్వామి హైకోర్టులో సవాల్ చేసారు. దీనిపై హైకోర్టు మహిళా కమిషన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి ఆదేశాలను కొట్టి వేసింది. వేణు స్వామి చెప్పిన జాతకంపై నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు? అంటూ ఫిర్యాదుదారులపై , మహిళా కమీషన్ పై కోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *