సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లా లో కీలక వైసిపి నేతలు టీడీపీ లోకి వలస కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో వైసిపి ద్వారా రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన నెల్లూరు కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి వైసీపీ నుండి రాజ్యసభ సీటు నిరాకరించి ఈసారి లోక్ సభకు పోటీ చెయ్యమని సీఎం జగన్ ఆదేశించడంతో ఆయన మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేసి నేడు, శనివారం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలోచేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ లో చేరటం శుభ పరిణామం అని, ఈసారి ఎన్నికలలో వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని.. ఎన్నికల కోడ్ వచ్చాక ఇంకా మార్పు వస్తుందని తెలిపారు. రాజధాని అంటూ విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తి విజయసాయిని నెల్లూరుకి పంపిస్తున్నారన్నారు. సీఎం జగన్ దోచుకున్న డబ్బుతో సిద్దం అంటూ హోర్డింగులా? అంటూ విమర్శించారు. దేనికి సిద్దం…ఓడిపోవడానికి సిద్దమా ?అని ప్రశ్నించారు.
