సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలో జెపి రోడ్డు లో కేవలం 7 కిమీ దూరంలో ఉన్న సీసలి గ్రామంలో ప్రసిద్ధ శ్రీ షిర్ది సాయి బాబా మందిరం గురువారం వచ్చిందంటే భారీ భక్తుల కోలాహలంతో, రద్దీతో మరో షిర్డీ దేవాలయాన్ని తలపిస్తుంది. సుమారు 3 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ మందిరంలో నిలువెత్తు బాబా వారి పాలరాతి విగ్రహం చక్కటి చిరునవ్వు మోము చూడగానే భక్తులకు తమ కష్టాలు సగం తీరిపోయినట్లనిపిస్తుంది. అలాగే షిరిడీ లో బాబా వారిని దర్శించుకున్న అనుభూతి వేలాది భక్తులతో ఆ వాతావరణం కనపడుతుంది. అయితే నేడు, గురువారం పబ్లిక్ హాలిడే కూడా కావడంతో ఇక ఈ సిసిలీ లో బాబాగారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య మాములుగా లేదు. సుమారు నేడు, 20వేలు పైగా భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి బాబా వారిని దర్శించుకొన్నారు. తదుపరి ఉదయం నుండి మధ్యాహ్నం 3వరకు జరిగిన అన్న సమారాధనలో పంచ భక్ష్య పరమణలతో ప్రసాదాన్ని స్వీకరించారు. భీమవరం విష్ణు డెంటల్ కాలేజీ వారు భక్తులకు ఉచిత పంటి పరీక్షలు చికిత్స మందులు అందజేశారు. భీమవరం పరిసర ప్రాంతాల నుండి అటు ఆకివీడు, కృష్ణజిల్లా వాసులు ఎంతో దూరం నుండి ఎందరో ప్రతిరోజూ సిసిలీ దర్శించుకొని అందమైన బాబా వారి మందిరంతో పాటు అక్కడి గోశాల లో గోవులను కూడా సందర్శిస్తారు. అక్కడే కొలను లో చిన్నికృషునిలా ఆదిశేషుని పడగపై నాట్య భంగిమలో బాబావారి ప్రతిమ ఒక ప్రత్యక ఆకర్షణగా ఉంటుంది.
