సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీస్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ ఆలయం ఆవరణలో 61 వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినాలలో ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చిన వేలాది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొంటే.. ప్రస్తుతం భీమవరం పరిసర ప్రాంతాలలో భక్తులతో కిటకిటలాడుతోంది. నేటి ఆదివారం ఉదయం నుండి భారీ క్యూ లైన్ లతో భక్తులు అమ్మవారిని అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. అనేక మంది మహిళా భక్తులు దూరప్రాంతాల నుండి వచ్చి తమ మొక్కుబడులు శ్రీ అమ్మవారికి చెల్లించుకొంటున్నారు. సాయంత్రం నుండి ఆలయ ఆవరణలో లైటింగ్ , సెట్టింగ్ అలంకరణలు అదనపు ఆకర్షణలు. నేటి సాయంత్రం 6గంటల నుండి కూచిపూడి బృందం ప్రదర్శన, తదుపరి 7గంటల నుండి వైరిటి బుర్రకథ రాత్రి 9 గంటల నుండి మోహిని భస్మాసుర’ జానపద నాటకం ( బాపట్ల కళాకారులచే) భక్తులను ప్రేక్షకులను అలరించనున్నాయి. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఉత్సవ ఏర్పాట్లు ను , భక్తుల సౌకర్యాలను ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేశ్ పర్యవేక్షిస్తున్నారు. వన్‌టౌన్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
