సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విజయవాడ విద్యా ధరపురం లోని మినీ స్టేడియం లో నేడు, సోమవారం సాయంత్రం రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది ముస్లీమ్ సోదరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. .. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సు లతో అందరూ బాగుండాలని, మన రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సూచించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే చెందుతుందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *