సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆసియా ఖండంలో తొలిసారిగా ఐపీ టివిగా ప్రారంభిస్తున్న” భీమ్ టీవీ” దేశంలో సాంకేతిక విప్లవం తెస్తోం దని సం స్థ ఛైర్మన్ రుద్రరాజు శ్రీనివాసరాజు అన్నా రు. గత శనివారం రాజమండ్రి దివాన్ చెరువు లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో టివిల వెనుక అమర్చే ఛానెల్స్, యాప్స్ రిసీవర్గా నెట్ ఆధారంగా పనిచేసే “భీమ్ టీవీ స్టిక్’ ను పారిశ్రామికవేత్త డీబీవీ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్ ద్వారా ‘భీమ్’ పేరుతో ఎటువంటి కేబుల్ వైర్లు లేకుండానే దేశంలో ఎక్కడ ఉన్న 4కె RDK లైనెక్స్ బేస్డ్ ఐపీ టీవీ బాక్స్ ను త్వరలోనే ప్రారంభించనున్నామన్నారు. ప్రపంచంలోని 6 ప్రఖ్యాత కంపెనీల సహకారంతో ,ఇండియాలోని టాటా ఎలాక్సీ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బాక్స్ రూపొందించినట్లు ఇది అన్ని ఇంటర్నెట్ సర్వీసులతో కేవలం 5 ఎంబి తో కూడా అత్యుత్తమ క్వాలిటీ తో ప్రసారాలు చూడవచ్చునని చెప్పారు. ఇందులో కస్టమర్ టు కస్టమర్ వీడియోకాలింగ్ సదుపాయం ఉందన్నా రు. ఓటీటీ యాప్లను సామాన్యులకు అందుబాటు రుసుముతో అందివ్వనున్నట్టు తెలిపారు. ఉగాది నుంచి ఈ బీమ్ స్టిక్ను మార్కె ట్లోకి అందుబాటు ధరలలో విడుదల చేసే యోచన లో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పట్టణాలకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన ఎంఎస్ ఓ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *