సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎర్రటి ఎండలు మండుతున్న వేళా తెలుగు రాష్ట్రాలలో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ లో అయితే గత 3 రోజులుగా వర్షాలు కురుస్తుంటే మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఏపీలో కుడా నిన్నటి నుండి పలు ప్రాంతాలలో వర్షపు జల్లులు పెనుగాలులు వస్తూనే ఉన్నాయి. భీమవరంలో కూడా నేటి బుధవారం ఉదయం నుండి వాతావరణం చల్ల గాలులతో ఆహ్లదంగా మారింది. తదుపరి మధ్యాహ్నం 1గంట నుండి ఒక్కసారిగా ఉరుములు పిడుగులతో పాటు ఒక గంట పాటు ఒక మోస్తరు వర్షం కురిసింది. తదుపరి వర్షపు ముసురు చల్లని గాలులు వీస్తున్నాయి. ప్రజలకు ఆహ్లదంగా ఉన్నపటికీ రేపటి ఉగాది పర్వదినం నేపథ్యంలో వ్యాపారం మస్తుగా ఉంటుందని భావిస్తున్న వ్యాపారులకు ముఖ్యముగా పూజ సామాగ్రి పువ్వుల వ్యాపారులకు వేప మామిడి అమ్మే వారికీ మాత్రం ఆందోళనగానే ఉంది.
