సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈ మండు వేసవిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఆందోళన తీవ్రమౌతుంది, వర్షాలతో పాటువాతావరణం శీతలగాలులతో బాగా చల్లబడిపోవడంతో చెరువులలో రొయ్యలు చేపలకు ఆక్సిజెన్ సమస్యాలు తలెత్తి పంట నష్టం జరుగుతుంది, వైరస్ లు మొదలవుతున్నాయి, ఉభయ గోదావరి జిల్లాలలో 2న్నర లక్షల ఎకరాలలో చెరువులలో చేపల, రొయ్యల సాగు జరుగుతోంది. వీటిలో సింహభాగం చెరువులు భీమవరం జోన్ పరిసరాలల్లో ఉంటాయి, ఏపీలో అత్యధిక ఆక్వా ఉత్త్పతులు ఎగుమతులు ఇక్కడినుండి జరుగుతాయి, పంట నష్టం కోట్ల రూపాయలలో వుండే అవకాశం ఉంది, అయితే అదృష్టవ శాత్తు ఇప్పటికే 60 శాతం మంది రైతులు పట్టుబడులు చేసుకున్నారు అని తెలుస్తుంది, మరికొందరు పట్టుబడులకు సిద్ధమవుతోన్నారు. ఇలాంటి సమయంలో వాతవరణం రైతులను భయపెడుతుంది. వర్షం పడుతున్న సమయంలో ఆక్సిజన్ టాబ్లెట్, పౌడర్ చెరువుల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి, అలాగే నీళ్లలో ఆక్సిజన్ శాతం పెంచడానికి బ్లోయర్స్, బోటులను కలియతిప్పుట వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని ముఖ్యంగా చేపల పట్టుబడులు నిలిపివేయాలి అని మత్య శాఖ నిపుణులు అంటున్నారు,
