సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కడప వైస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటనలో భాగంగా ఆయన తండ్రి, .మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నేడు, శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఒకే వరుసలో కూర్చుని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. తండ్రి కి నివాళ్లు అర్పిస్తూ .. సీఎం వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్‌కు నివాళి అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.
