సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కడప జిల్లాలో పలుమారులు ఎంపీగా, ఎమ్మెల్యేగా అసలు ఓటమి ఎరుగని ధీరుడుగా, వరుసగా 2 మారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా పనిచేసి ఆకస్మితంగా కనుమరుగయిన తెలుగువారి దర్పం దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా నేడు,సోమవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ లోక్ సభ ఎంపీలు అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నేతలు హాజరు అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సా ర్సీపీ, శ్రేణులు ఘనంగా నిర్వ హిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, జగన్ ఒక ట్వీట్ విడుదల చేసారు. దానిలో.. నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి. మీ జగన్ అంటూ ట్వీట్ చేసారు.
