సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైజాగ్ నుంచి వారణాసి (కాశీ )కి ప్రత్యేక రైలు ను నేడు, బుధవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ స్టేషన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రుల చిరకాల ఆకాంక్ష.. విశాఖ-వారణాసి మధ్య రైలును గంగా పుష్కరాల సందర్భంగా అమల్లోకి తెచ్చామన్నారు. ఇక్కడి నుంచి నేరుగా వారణాసి రైలు కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఈ సందర్బంగా జీవీఎల్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.ఈనెల 22వ తేదీ నుంచి మే 3 వరకూ గంగా పుష్కరాలు వున్నాయని, నేడు, బుధవారం మధ్యాహ్నం 12-30 గంటలకు ప్రత్యేక రైలు విశాఖ నుంచి బయలు దేరి, గురువారం మధ్యాహ్నం 1 గంటకు దీన దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. పుష్కరాల సందర్భంగా విశాఖ- కాశీ మధ్య రైలు 11 పర్యాయాలు నడుస్తుందన్నారు. ఇంటర్ రైల్వే జోనల్ సమస్యలను అదిగమించి రైలును సాధించుకున్నామన్నారు. వేసవి తర్వాత కూడా రెగ్యులర్‌గా నడిచేందుకు కృషి చేస్తామని జీవీఎల్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *