సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాల్తేరు వీరయ్య’ మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా . ప్రీ రీలీజ్‌ వేడుక గత ఆదివారం రాత్రి విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘బాబి నా అభిమానిగా నా దగ్గరకు వచ్చాడు. ఈ కథ చెప్పాడు. ‘వాల్తేరు వీరయ్య’ అనగానే ఆ పేరే నాకు నచ్చేసింది. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ‘ఓకే’ చెప్పిన కథలేవీ నన్ను నిరుత్సాహ పరచలేదు. సూపర్‌ హిట్లు అయ్యాయి. ‘వాల్తేరు..’ కూడా అదే జాబితాలో చేరుతుంది. ఇక ‘విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి మనుషులు స్వచ్ఛంగా ఉంటారు. సినిమాని ప్రేమిస్తారు. విశ్రాంత జీవనం విశాఖలో అయితే బాగుంటుందని నాతో చాలామంది చెప్పారు. అందుకే భీమిలిలో ఓ స్థలం కొన్నా. త్వరలో ఇల్లు కట్టుకొంటా. నేనూ విశాఖ వాసిని అవుతా’’ బహిరంగంగా ప్రకటించారు చిరంజీవి. ఇక రవితేజ అంటే నాకు చాలా ఇష్టం. అంచెలంచెలుగా ఎదిగాడు. ‘ఆజ్‌ కా గుండారాజ్‌’లో చిన్న వేషం వేశాడు. అప్పట్లో తాను హిందీ మాట్లాడుతుంటే సరదాగా ఉండేది. శ్రుతి బాగా నటించింది. విదేశాల్లో విపరీతమైన చలిలో ఓ పాట చేశాం. గజ గజ వణికిపోయే పరిస్థితుల్లోనూ నవ్వుతూ నాట్యం చేసింది. మైత్రీ మూవీస్‌ లాంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు కావాలి. దర్శకుడు బాబి మాట్లాడుతూ ‘‘అన్నయ్యపై అభిమానంతోనే ఈ చిత్రసీమకు వచ్చా. ఇప్పుడు ఆయనతోనే సినిమా తీశానంటే.. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. ఇంతకంటే ఏం కావాలి? అన్నయ్యకు రాజకీయాలు పనికిరావు. ఆ పని.. పవర్‌ స్టార్‌ చూసుకొంటారు. మాటకు మాట, కత్తికి కత్తి సమాధానం చెప్పే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. ‘వాల్తేరు వీరయ్య’ విశ్రాంతికి ముందొచ్చే పది నిమిషాల ఎపిసోడ్‌ అరాచకం సృష్టిస్తుంది. అక్కడి నుంచి పూనకాలు మొదలైపోతాయి. అన్నయ్య అభిమానులంతా కలిసి, ప్రేమగా పనిచేసిన సినిమా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *