సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా, స్కానింగ్, సంబంధిత పరీక్షలు నిర్వహించగా, వైద్యులు కొన్ని సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉన్నందున, ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఆయన మిగతా పరీక్షలను చేయించు కోనున్నారు.పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సయాటికాతో బాధపడుతున్నారు. అందుకే ఆయన ఇటీవల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే ఆరోగ్యం నమవుతుందని భావించే, కేరళ, తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. తాజాగా ప్రయాగరాజ్‌కు వెళ్లి పుణ్య స్నానం కూడా చేసారు. అయితే రేపటి నుండి ఏపీలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఆయన కార్యాలయం ప్రకటించింది.
