సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ సినిమాలలో ఆది , టాగూరు, లక్ష్మి,కృష్ణ, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 వంటి ఎన్నో బంపర్ హిట్స్ కొట్టాడో అందరికి తెలిసిందే.. మరి ఇప్పటివరకు వైసీపీ మద్దతుగా ఉన్న వినాయక్ ఇకపై వచ్చే ఎన్నికలలో పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాలలో అడుగు పెట్టె యోచనలో పావులు కదుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు కు చెందిన వినాయక్ తండ్రి కూడా గతంలో రాజకీయనేపథ్యంలో అనేక పదవులు ల్లో ఉన్నారు. గోదావరి జిల్లాలో ఎక్కువగా కాపు సామాజిక వర్గమే ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో కీలకమైన స్థానాలలో జనసేన- టీడీపీ కూటమికి వ్యతిరేకంగా మంచి పట్టు ఉన్న నేతలు లేదా ప్రముఖులకే వైసిపి సీట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో వివి వినాయక్ గోదావరి జిల్లాలోని ఏలూరు లేదా కాకినాడ లోక్ సభ స్థానాలలో ఎదో ఒకదానిలో పోటీకి నిలపాలని వైసిపి అధిష్టానం పావులు కదుపుతున్నట్లు సమాచారం.. పైగా.. అందులో ఇప్పుడు వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని, మద్దతుగా ఉన్న వల్లభనేని వంశీ, యంగ్ ఎన్టీఆర్ లకు కూడా వినాయక్ అత్యంత ఆప్తుడు..అందుకే అయితే లోక్ సభ స్థానం నుండి లేదా గోదావరి జిల్లాలలో కీలకమైన అసెంబ్లీ స్థానం నుండి పోటీకి సిద్ధంగా ఉండాలని వివి వినాయక్ కు పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇటీవల వినాయక్ చాగల్లు పరిసర గ్రామాలలో పర్యటిస్తుండటం వైసీపీ నేతలు ఘన స్వాగం పలకడం, ర్యాలీలు నిర్వహించడం.. వారితో సమీక్షలు జరగపడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మృదు స్వభావిగా ఉంటె వినాయక్ కు భీమవరంతోసహా గోదావరి జిల్లాలలో లెక్కేలేనంత మంది మిత్రులు ఉన్నారు మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *