సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ ను అభిమానించే ప్రముఖ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసిపి పార్టీలో కొనసాగుతున్న విషయం విదితమే..అయితే ఆయన నేడు, శనివారం పార్టీకి షాక్ ఇస్తూ ట్వీ ట్ చేశారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నావేరే పార్టీలలో చేరను, అయితే త్వరలోతదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’’ అని తెలిపారు. గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరినట్లు ప్రచారంలో ఉంది. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని బిసి అభ్యర్థిగా గుంటూరు స్థానానికి మారాల్సిందిగా గత శుక్రవారం వైసిపి అధిష్టానం ప్రతిపాదించారు. ఈనేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన అంబటి రాయుడు ఇప్పటికే అక్కడ పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకొని, స్థానిక ప్రజలు, యువత తో మమేకం అవుతున్న నేపథ్యంలో తీవ్ర నిరాశతో ఈ ట్విట్ చేసినట్లు భావించవచ్చు. అయితే వైసిపి పెద్దలు మరోసారి అంబటి రాయుడిని బుజ్జగించే అవకాశం ఉంది.
