సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అవనిగడ్డలో 4వ విడుత వారాహి యాత్ర ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గత ఆదివారం రాత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. సభకు విచ్చేసిన పెద్ద ఎత్తున విచ్చేసిన జనసైనికులకు, తెలుగు తమ్ముళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులు .. అధికార వైసీపీ వాళ్ళు కౌరవులు.. వాళ్ళు అధికారం నుంచి దిగడం ఖాయం. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ అండగా ఉంటాం. 2018 నుంచి ఉద్యోగాలు లేవు. 30వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. నన్ను ఒక్కడిని అయిన అసెంబ్లీ కి పంపి ఉంటె ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉండేవాడిని.. నేను అధికారం కోసం అర్రులు చాచడం లేదు. మీ భవిష్యత్ కోసం అనుక్షణం ఆలోచిస్తాను. ప్రజలు కూడా ఈసారి జగన్ ను అధికారంనుండి దించితే సరే.. లేకున్నా నేను ఇక్కడే ఉండి పోరాడతాను. చంద్రబాబు జైలు నుండి బయటకు త్వరలోనే వస్తారు ఓట్లు చీలకుండా తెలుగుదేశం తో పొత్తు తో పోరాటానికి సిద్ధం. TDP వాళ్లతో ఈ పర్యాయం ఎటువంటి అపోహలు రావనే నమ్ముతున్నాను.. జగన్ ను కూడా 10 ఏళ్ళు బయట ఉండి కష్టపడితేనే అధికారంలోకి వచ్చాడు.. అధికారం వచ్చాక ఇప్పడు పరదాలలో ఉంటున్నాడు...జనం కూడా మనల్ని నమ్మాలంటే కొంత సమయం పడుతుంది. అయితే వైసిపి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. నా దగ్గర పార్టీ కోసం డబ్బు లేదు అంతే తేడా.. పదేళ్లలో చాలా దెబ్బలు తిన్నాను.. ఓటమి నిస్సహాయంగా ఉంటుంది. ఆశయాలు, విలువలకోసం నడిపేవాడ్ని కాబట్టే నిలబడి ఉన్నాను’ అని సేనాని చెప్పుకొచ్చారు.
