సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ కీలక నేత తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతల ఆత్మీయ సమ్మేళనంలో కూటమి పాలన అద్వానంగా సాగుతుందని, ప్రజలకు సుఖం లేదని, కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు కాలేదు అప్పుడే లక్షన్నర కోట్లు కొత్త అప్పులు చేసారని, సూపర్ సిక్స్ పధకాలు అంటూ ఉన్నవే ఎగ్గొటేశారని ..రోజు రోజుకు మహిళలపై అరాచకాలు పెరిగాయని, ప్రజలు ను గతంలో సీఎం గా జగన్ ఎంత గొప్పగా ఆదుకొన్నాడో ఇప్పుడు స్వష్టంగా అర్ధం అయ్యిందని, వైసీపీ క్యాడర్ ఫై జరుగుతున్నాఅంతులేని దారుణాలు బెదిరింపులు ప్రజలు చుస్తునారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి త్రిప్పటం ,మనకు టైం వచ్చేస్తుంది.. ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసీపీ అధికారంలోకి రావడం ఎవరు ఆపలేరని అంటూ కూటమి నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘నేను ఇటీవల పెద్దిరెడ్డి దగ్గరకు వెళ్లాను.వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసిన కూడా దాన్ని దాటి ప్రజలు మనకు ఓటేస్తారని చెప్పాను. కొందరు తెలుగుదేశం నాయకులు సైతం మాపై కక్ష పెట్టుకోవద్దు అని మమ్ములను అంటున్నారు. ఇక అది మాత్రం జరగదు. గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతారు. గుంటూరు అవతలి నుంచి న..పారేస్తారు. ’‘మీ ఇంటికి మేము ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం’ అంటూ హెచ్చరిక ధోరణినిలో మాట్లాడారు. వైసీపీ వాళ్లకు ఇంకా మదం దిగలేదని కారుమూరి చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చెయ్యడం గమనార్హం.
