సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఆదివారం రాత్రి , భీమవరంలోని ఆనంద్ ఇన్ ఫంక్షన్ హాల్ లో భీమవరం నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో శాసన సభ్యులు గ్రంధి శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల మరియు వైసీపీ నేతలు క్యాడర్ భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే ఎన్నికలలో ఇటు అసెంబ్లీ నుండి గ్రంధి శ్రీనివాస్ ను లోక్ సభకు గూడూరి ఉమాబాలను భారీ మెజారిటీలతో గెలిపించాలని, ఇక్కడ వైసీపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు రాష్ట్రంలో హైలైట్ కావాలని, సీఎం జగన్ పాలన విజయాలు ప్రజలలోకి తీసుకొనివెళ్ళాలని , కూటమి ప్రచారాన్ని త్రిప్పి కొట్టాలని దానికి కావాల్సిన కార్యాచరణ ఫై వక్తలు మాట్లాడటం జరిగింది.
