సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీకి మరో షాక్ తగిలింది.మొన్న ఎన్నికలకు ముందే టీడీపీ నుండి వైసీపీ లోకి చేరినందుకు కానుకగా ఎమ్మెల్సీ పదవి పొందిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీకి జయమంగళ వెంకటరమణ నేడు, శనివారం పార్టీని వీడారు. ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు జయమంగళ వెంకటరమణ తాజగా ప్రకటించారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ మోసేనురాజుకు పంపించినట్లు తెలిపారు. జయమంగళం కు భీమవరం నియోజకవర్గంలో పలువురితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బిసి వర్గానికి చెందిన ఆయన ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో వెంకటరమణ నేడు తిరిగి సొంత పార్టీ గూటికి చేరుకోనున్నట్లు సమాచారం. మరి టీడీపీ ఆయనకు ఏ ప్రాధాన్య పదవి ఇస్తుందో ఇంకా తెలియరాలేదు.
