సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు ఫై తన నిరసన ను ఢిల్లీ వరకు తీసుకొనివెళ్ళి అక్కడ ఇండియా కూటమి నేతల మద్దతు సంపాదించిన క్రమంలో దేశరాజకీయాలలో సంచలనం రేపిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ తాజగా..జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అధికార టీడీపీ ని ఉద్దేశించి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తనను చంపాలనుకుంటే.. చంపేయండి’ అని అన్నారు. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. టీడీపీ రాజకీయ కక్షతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందని ఆరోపించారు. తమ పార్టీని లేకుండా చేయాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
