సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ పార్టీ కష్ట సుఖాలలో కలసి నడచిన జగన్ బంధువు.. ఆ పార్టీ లో అగ్రనేత , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం లో తనకు పార్టీలో ప్రాధాన్యత ఫై కొంత అసంతృప్తి చెందారు. తదుపరి ఎన్నికలలో తనకు ప్రజలు ఓట్లు వేసినప్పటికీ ఓటింగ్ జరిగిన తీరు, తన ఓటమి కి ఈవీఎం బాక్స్ లలో ఎదో మతలబు జరిగిందని కోర్ట్ కు వెళ్లడం .. ఈవీఎం బాక్సలల్లో ఓటర్ల స్లిప్ లు తెరచి చూడాలని కోరటం దానికి ఈసీ అధికారులు నిరాకరించడం తో తిరిగి హైకోర్టు కు వెళ్లడంతో.. అక్కడ హైకోర్టు ఇప్పటికి తీర్పు ఇవ్వకపోవడంతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో కూడా వైసీపీ పార్టీ అధినేత జగన్ నుండి కూడా EVM.. విషయంలో ఏ కారణం చేతనో తనకు సరైన మద్దతు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు ఇటీవల అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డి రేపు (గురువారం)సమావేశం అవుతారని వార్తలు వస్తున్నాయి. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని 1999, 2004, 2009, 2012, 21019లో 5 సార్లు పోటీ చేసి గెలుపొందారు.
