సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాను నమ్మిన వై యస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కోసం ఎంతకైనా పోరాడే వ్యక్తిగా జగన్ కు నమ్మినబంటుగా పెద్దాయన విజయసాయిరెడ్డి కి రాజకీయాలకు అతీతంగా తెలుగునాట ప్రత్యేక స్థాయి ఉంది. వై యస్ మరణం తరువాత జగన్ కు అండగా ఉంటూ సిబిఐ కేసులకు భయపడకుండా జగన్ తో పాటు జైలు కు వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించి జగన్ ను విమర్శించిన ఎంతటి నేతను అయిన తనదయిన పదునైన మాటలతో ఎదురుదాడి చేసే విజయ సాయిరెడ్డి, అధికార టీడీపీ ని ఎదుర్కోవడానికి, వాళ్ళ అనుకూల మీడియా ఛానెల్స్ ని ఎదురుకోవడానికి జగన్ వద్దన్నా సరే! త్వరలో ‘న్యూస్ ఛానెల్ పెడుతున్నాను. అంటూ ఇటీవల ప్రకటించిన ఆయన అంతలోనే తాజాగా వైసీపీ ని వదిలేశారంటే దాని వెనుక ఎంత పెద్ద కారణం ఉండి ఉంటుంది..? ఇప్పటి వరకు అధికారం పోయింది కాబ్బటి కొందరు వేరే అధికార పార్టీలోకి పొతే పోయారు కొత్తగా వచ్చే నష్టం ఏమిటి? అనుకున్న .. వైసీపీ అధిష్టానానికి. ఆ పార్టీ క్యాడర్ కు తాజగా విజయసాయి రెడ్డి రాజకీయాలకు బై బై చెప్పటం అంత ఆషామాషీగా జీర్ణించుకొనే విషయం కాదు. వారికే కాదు టీడీపీ బీజేపీ జనసేన నేతలు కూడా ఎప్పుడు ఉహించలేంది. జగన్ కు మంచి జరగాలని భవిష్యత్తులో వ్యవసాయం చేసుకొంటాను, అని చెప్పినప్పటికీ వైసీపీ కి ఎంత నష్టం? విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇటీవలే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభకు ముగ్గురు రాజీనామా చేసి కూటమి పార్టీలలో చేరారు. ఇప్పుడు రాజీనామా బాటలో విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో రాజ్యసభలో బలమైన వైసీపీ బలం 8 నుండి ఏడుగురికి తగ్గిపోతోంది . మరి కూటమి పార్టీల అభ్యర్థికే ఆ రాజ్యసభ సీటు దక్కుతుంది. అది కూడా పరోక్షంగా కూటమి పార్టీలకు విజయసాయి రెడ్డి చేస్తున్న మేలుగానే పరిగణించాలి. ఏది ఏమైనా దీనిపై అధినేత జగన్ వైఖరి ఏవిధంగా ఉండనుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *